NE NEWS SERVICE
AMARAVATI, APRIL 11
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy, has explained the effective implementation of lockdown with human touch in the State to check the pandemic and said any decision by the Centre would be fully endorsed but at the same time opined that the wheel of economy should keep moving irrespective of its pace.
Participating in the video conference with Prime Minister Narendra Modi on Saturday, the Chief Minister listed out the measures being taken by State, and said, of the 676 mandals, 27 mandal are declared as red zones and 44 as orange zones. Effective steps are being taken under Centre guidelines to contain the spread of COVID-19. The State has identified 141 containment clusters.
“We have screened 1.4 crore people and a workforce of 2,61,216 village and ward volunteers, 40,000 Asha workers, 20,200 ANMs is constantly monitoring situation at field level in identifying the COVID-19 cases. About 3000 medical staff are providing services. The State has set up one COVID-19 hospital in each of the 13 districts besides isolation centers with 26,000 beds”, Jagan said.
Besides four dedicated four hospitals for COVID-19, the State will also set up 78 hospitals.
As the economic activity should go on, we are of the opinion to implement lockdown in red zones and provide a helping hand to farmers who have to sell their rabi crop, he said.
Agricultural and allied fields like aqua culture and horticulture are being badly affected with farmers unable to sell the Rabi crop as transport has come to a halt. Godowns are full and storage is a problem.
On the industrial front, fixed costs would be a burden. Of the 1.04 lakh units only 7,250 units are functioning. Daily wage earners, farm hands people from the unorganized sector are badly hit by lockdown.
However, at this hour we have to stand united in the fight against COVID-19 and we will follow your strategy and guidelines, the Chief Minister said.
Here is the Telugu version of Chief Minister’s address during the Chief Ministers’ Meeting with PM
– రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాం: సీఎం
– అదే సమయంలో మానవతా కోణంలో స్పందిస్తున్నాం: సీఎం –రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్లకుపైగా ఉన్న కుటుంబాలను, వారి ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నాం: సీఎం
– కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి పరీక్షలు చేసి, వారికి వైద్యం అందిస్తున్నాం:
– ఏపీలో 2,61,216 గ్రామ, వార్డు వాలంటీర్లు, 40వేల మంది ఆశ వర్కర్లు, 20,200 మంది ఏఎన్‌ఎంలు ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు:
– కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి, వారికి దాదాపు 3వేలమంది వైద్యులు సేవలు అందిస్తున్నారు:
– అలాగే కరోనా పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ వ్యూహం కొనసాగుతోంది:
– లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్‌మెంట్ క్లస్టర్లను హాట్‌స్పాట్లుగా గుర్తించాం:
– ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతున్నాం:
– క్రిటికల్ కేర్ కోసం నాలుగు అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటుచేసుకున్నాం:
– 13 జిల్లాల్లోని ప్రతి జిల్లాకూ ఒక కోవిడ్ ఆస్పత్రిని ఏర్పాటు చేసుకున్నాం:
– జిల్లాల్లో వీటికి అదనంగా మరో 78 ఆస్పత్రులను ఏర్పాటుచేసుకుంటున్నాం:
– సమర్థవంతంగా క్వారంటైన్ చేయడానికి ప్రతి జిల్లాలో కోవిడ్ కేర్‌సెంటర్లను ఏర్పాటుచేసుకున్నాం, ఇందులో 26వేల బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి:
– మన ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే ప్రధాన భూమిక:
– జీఎస్‌డీపీలో 35శాతం, ఉపాథికల్పనలో 62శాతం వాటా వ్యవసాయానిదే:
లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రాల మధ్య వ్యవసాయ ఉత్పత్తుల రవాణా గణనీయంగా పడిపోయింది:
– నిలిపివేస్తారనే భయంతో 25శాతం మించి ట్రక్కులు తిరగడంలేదు :
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను భద్రపరచడానికి, నిల్వచేయడానికి సరిపడా గోదాములు లేవు:
– మార్కెట్లు నడవకపోవడంతో ధాన్యం, మొక్కజొన్న, మిర్చి, పొగాకు, అరటి, బొప్పాయి, కూరగాయలను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది:
కాని స్థానికంగా వీటిని ఎంతవరకు వినియోగించగలం?:
– ఇప్పుడున్న పరిస్థితి కొనసాగితే లక్షలాది వ్యవసాయ కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయి:
– నిల్వచేయడానికి తగిన స్టోరేజీ సదుపాయంలేక, ఎగుమతులు లేక ఆక్వా రంగంకూడా తీవ్రంగా దెబ్బతింటోంది:
– ఇక రాష్ట్రంలోని పారిశ్రామిక రంగం విషయానికొస్తే.. . 1,03,986 యూనిట్లకుగానూ 7,250 మాత్రమే నడుస్తున్నాయి:
– పంపిణీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది:
– రోడ్డు, రైల్వే రవాణాలు నిలిచిపోవడంకూడా సంక్షోభం పెరగడానికి కారణమయ్యింది:
– పరిశ్రమలు నడవనప్పుడు… వారు జీతాలు చెల్లించగలరని మనం ఎలా ఆశించగలం?:
– రాష్ట్రానికి ఆదాయం కూడా రాని పరిస్థితి:
– సహాయ కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత పరిస్థితి తలెత్తింది:
– లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యవసాయం, ఉద్యానవన, ఆక్వా రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు:
– కోవిడ్‌ని–19 నివారణకు ప్రధాని మంత్రిగా మీరు తీసుకున్న విశాలపరమైన, గట్టి చర్యలను నేను బలంగా సమర్థిస్తున్నాను:
– అదే సమయంలో ఆర్థిక వ్యవస్థ చక్రం ముందుకు కదలాలన్నది నా అభిప్రాయం:
– ఆర్థిక వ్యవస్థ చక్రం పూర్తి వేగంతో ముందుకు కదలకపోయినా, కనీసం ప్రజల అవసరాలకు తగినట్టుగా నైనా నడవాలన్నది నా అభిప్రాయం:
– 1918లో వచ్చిన ఫ్లూ కూడా భారతదేశ ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది:
– రెండేళ్లకుపైగా అది దేశంపై ప్రభావం చూపింది:
– మనం దీన్ని పరిగణలోకి తీసుకుంటే… దీర్ఘకాలంలో మనం పోరాటంచేయాల్సి ఉంటుంది:
– ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో అందుబాటులో ఉన్న వివరాలను, సమాచారాన్ని పరిగణలోకి తీసుకున్ని దాన్ని విశ్లేషించి కొన్ని అంశాలను మీ ముందు ఉంచుతున్నాను:
– 676 మండలాలు మా రాష్ట్రంలో ఉన్నాయి:
కరోనా వైరస్ సోకిన మండలాల్లో 37 రెడ్‌జోన్‌లో ఉన్నాయి, ఆరెంజ్ జోన్లో 44 మండలాలు ఉన్నాయి:
– 676 మండలాల్లో 81 మండలాలు రెడ్‌జోన్, ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయి:
595 మండలాలు గ్రీన్‌జోన్లో ఉన్నాయి, ప్రస్తుతానికి కరోనా ప్రభావం వీటిపై లేదు:
– రెడ్‌జోన్లకే లాక్‌డౌన్ పరిమితం చేయాలన్నది నా అభిప్రాయం:
– జనం గుమిగూడకుండా మాల్స్, సినిమాహాళ్లు, ప్రార్థనామందిరాలు, ప్రజారవాణా, పాఠశాలలపై ఇప్పుడున్న పరిస్థితి కొనసాగాలన్నది నా అభిప్రాయం:
– ఇవికాకుండా మిగిలిన చోట్ల భౌతిక దూరం పాటించాలన్నది నా అభిప్రాయం:
– కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా దేవుడి దయవల్ల అడ్డుకోగలుగుతున్నాం:
– మన కంటికి కనిపించని ఈ మహమ్మారి త్వరలోనే నయం అవుతుందని నమ్ముతున్నాం:
– నా అభిప్రాయంతో పాటు, మా రాష్ట్రంలో జరుగుతున్న అంశాలపై మీకు సంక్షిప్తంగా నివేదించాను:
– ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడంలో ఒక్కటిగా ఉండాలి, ఒకే రకమైన వ్యూహంతో ముందుకు సాగాలి:
– మీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉంది:
– ప్రధానిగా మీరు సూచించే వ్యూహంతో ముందుకుసాగుతాం: